ఫినిషింగ్ మోడ్ లోకి వచ్చేసిన “పుష్ప 2”?

ఫినిషింగ్ మోడ్ లోకి వచ్చేసిన “పుష్ప 2”?

Published on Jul 2, 2024 6:30 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ సీక్వెల్ చిత్రం “పుష్ప 2” (Pushpa 2 The Rule) కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాని మేకర్స్ ఈ ఆగస్ట్ నుంచి డిసెంబర్ కి మేకర్స్ షిఫ్ట్ చేశారు. అయినప్పటికీ సినిమాపై అంచనాలు అలానే ఉన్నాయి కానీ సినిమా వాయిదా పడడానికి అయితే పలు కారణాలు ఉన్నాయి.

మరి ఈ కారణాల్లో షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాకపోవడం కూడా అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఫైనల్ గా చిత్ర యూనిట్ ఫినిషింగ్ మోడ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు నుంచి రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ చేశారట. మరి ఇందులో అల్లు అర్జున్ సహా ముఖ్య నటీనటులు పాల్గొంటారని తెలుస్తుంది.

ఇక ఇక్కడ నుంచి సినిమా షూటింగ్ దాదాపు నెల పాటుగా నాన్ స్టాప్ గా కొనసాగుతుందట. దీనితో సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తయ్యిపోయినట్టే అట. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు