సాలిడ్ గా “పుష్ప” మేకింగ్..సెట్స్ లో బన్నీ గ్రేట్ గెస్చర్.!

సాలిడ్ గా “పుష్ప” మేకింగ్..సెట్స్ లో బన్నీ గ్రేట్ గెస్చర్.!

Published on Dec 5, 2021 12:10 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా టాలీవుడ్ ఆల్ టైం క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుండగా ముందు దాని కన్నా రాబోతున్న సాలిడ్ ట్రైలర్ కి కావాల్సిన హైప్ ని మేకర్స్ తెస్తున్నారు.

మరి ఇప్పుడు చిత్ర యూనిట్ ఆసక్తికర మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. అయితే ఇందులో మొదటగా బన్నీ గొప్ప మనసు కోసం మాట్లాడుకోవాలి. తమ చిత్ర యూనిట్ ఓ ప్రాంతంలో షూట్ చేసినపుడు వారు వాడిన వస్తులు ప్లాస్టిక్ ని అక్కడ డస్ట్ బిన్స్ లో పడేయాలని మనం ఎలా అయితే వచ్చామో అలానే తిరిగి వెళ్లాలని వారి స్థలాన్ని క్లీన్ గా ఉంచాలని సూచించాడు.

ఇది నిజంగా తన నుంచి ఒక గ్రేట్ గెస్చర్ అని చెప్పాలి. ఇక మేకింగ్ విషయానికి వస్తే మాత్రం సుకుమార్ అండ్ యూనిట్ వర్క్ సెట్ లో సాలిడ్ గా ఉందని చెప్పాలి. యూనిట్ మొత్తం కష్టం సుకుమార్ సన్నివేశాలు వివరించే విధానాలు ఆసక్తిగా అనిపిస్తున్నాయి. దీనితో రేపు రాబోయే ట్రైలర్ పై మరిన్ని అంచనాలు రేకెత్తుతున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు