పుష్ప డిలీట్ సీన్ ను విడుదల చేసిన టీమ్!

Published on Dec 31, 2021 11:47 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మీక మందన్న నటించగా, సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫజిల్, ధనంజయ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇప్పటికే థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది.

ఈ చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల భారీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి డిలీట్ చేసిన ఒక వీడియో ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదిక గా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో సైతం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం కి సంబంధించిన రెండవ పార్ట్ పుష్ప ది రూల్ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :