“పుష్ప”రాజ్ విలన్ ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Aug 27, 2021 6:01 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో కథ ఉండనుంది. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా చిత్రం యూనిట్ ఒక ప్రకటన చేయడం జరిగింది.

ఈ చిత్రం లో ఫాహద్ ఫాసిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పుష్పరాజ్ కి విలన్ పాత్ర అవ్వడం తో ఇన్ని రోజులు పాత్ర కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రివీల్ చేయకుండా ఉంచారు. పుష్పరాజ్ విలన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పై చిత్ర యూనిట్ తాజాగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఫాహద్ ఫస్ట్ లుక్ ను రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం లో ఇప్పటికే ధనంజయ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తుండగా, చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :