మహేష్,బన్నీలలో ఎవరిది బెటర్ జడ్జిమెంట్?

Published on Apr 10, 2020 5:28 pm IST

సుకుమార్ రంగస్థలం లాంటి భారీ హిట్ అందుకున్నాక మరో సినిమా పట్టాలెక్కించడానికి రెండేళ్లు పట్టింది. ఆయన రంగస్థలం మూవీ తరువాత మహేష్ తో మూవీ చేయాలని ఆశపడ్డారు. స్టోరీ లైన్ వినిపించగా స్క్రిప్ట్ సిద్ధం చేయమన్న మహేష్ పూర్తి స్క్రిప్ట్ తో సంతృప్తి చెందక ఆ ప్రాజెక్ట్ చేయను అని చెప్పేశారు. దీనితో ఏడాది మహేష్ కోసం ఎదురుచూసిన సుకుమార్ కి నిరాశ ఎదురైంది. అదే స్క్రిప్ట్ తో ఇప్పుడు బన్నీతో సుకుమార్ మూవీ చేస్తున్నారు. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.

కాగా ఈ చిత్ర ఫలితాన్ని బట్టి మహేష్, బన్నీ ల స్క్రిప్ట్ సెలక్షన్ మరియు జడ్జిమెంట్ చెప్పవచ్చు. పుష్ప ఒక వేళ పరాజయం పాలైతే మహేష్ జుడిమెంట్ కరెక్ట్ అని, ఒక వేళ మూవీ భారీ విజయం అందుకుంటే అల్లు అర్జున్ జడ్జిమెంట్ కరెక్ట్ అని. మూవీని వదులుకున్న మహేష్, చేస్తున్న బన్నీకి ఇది ఒక టెస్ట్ అని చెప్పొచ్చు. ఇక బన్నీ పుష్ప మూవీతో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More