అమెజాన్ ప్రైమ్ లో “పుష్ప” స్పెషల్ బ్యానర్

Published on Aug 26, 2021 2:57 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ చిత్రం నుండి ఆగస్ట్ 13 వ తేదీన ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యి అన్ని బాషల్లో ట్రెండ్ అవుతోంది.

పుష్ప చిత్రం కి సంబంధించిన పోస్టర్ ఒకటి ఇప్పుడు అమెజాన్ మ్యూజిక్ లో దర్శనం ఇస్తుంది. ఈ స్పెషల్ బ్యానర్ ను అమెజాన్ ప్రైమ్ ప్రమోట్ చేయడం తో అటు చిత్ర యూనిట్ తో పాటుగా, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్ కి మొదటి సారి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో పుష్ప చిత్రం లోని పాటలకు వస్తోంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా, ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తుండగా, డిసెంబర్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :