“పుష్ప”రాజ్ ఇంట్రో ఖాతాలో మరో మైల్ స్టోన్.!

Published on Jun 30, 2021 8:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా అప్ గ్రేడ్ చేస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మన టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు దేశ వ్యాప్తంగా కూడా నెలకొన్నాయి. మరి ఈ సినిమా అంచనాలు మరో స్థాయికి వెళ్ళడానికి ఈ చిత్ర టీజర్ ఎంత దోహదపడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప రాజ్ ను ఇంట్రో చేస్తూ డిజైన్ చేసిన సుకుమార్ టీజర్ కట్ ఇండియా లోనే రెండో అతిపెద్ద రెస్పాన్స్ వచ్చిన టీజర్ గా నిలిచింది.

మరి మొన్ననే మన టాలీవుడ్ లో 70 మిలియన్ వ్యూస్ తో సెన్సేషనల్ రికార్డు అందుకున్న ఈ టీజర్ ఇప్పుడు స్పీడ్ తగ్గకుండా 75 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి మరో భారీ మైల్ స్టోన్ ను టచ్ చేసింది. దీనితో పుష్ప రాజ్ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇక ఈ సాలిడ్ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :