‘పుష్ప’ టీజర్ : బన్నీ తగ్గేదేలా..

Published on Apr 7, 2021 8:50 pm IST

అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప రాజ్ ఇంట్రడ్యూజింగ్ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మొదటి నుండి ఈ టీజర్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్ ఆ అంచనాలను అందుకుందని పక్కాగా చెప్పవచ్చు. ఎందుకంటే టీజర్లో అలాంటి కంటెంట్ ఉంది మరి. బన్నీని నెవర్ బిఫోర్ అనేలా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ సుకుమార్. కాస్ట్యూమ్ నుండి హెయిర్ స్టైల్ వరకు, లాంగ్వేజ్ నుండి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నీ కొత్తగా, క్రేజీగా ఉండేలా చూసుకున్నారు.

స్మగ్లర్ పుష్ప పరిచయం మొత్తం అడవుల్లోనే చూపించారు. దీన్నిబట్టి సినిమా మొత్తం అటవీ ప్రాంతాల్లోనే జరుగుతుందని స్పష్టమైంది. టీజర్లో బన్నీకి కొత్తగా ఒక ఫిజిలా మేనరిజమ్ కల్పించారు. ‘రంగస్థలం’లో చిట్టిబాబుకు వినికిడి లోపం ఉన్నట్టు ఇందులో పుష్పకు చేతి భుజం కొంచెం డిఫెక్ట్ ఉన్నటు చూపించారు. అల్లు అర్జున్ చెప్పింది సింగిల్ వర్డ్ డైలాగే అయినా మంచి కిక్ ఇచ్చింది. ఇక యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ప్రతిదీ హెవీగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టారు దేవి శ్రీ. ఇక ఫారెస్ట్, నైట్ ఎఫెక్ట్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందులో బన్నీ చెప్పినట్టు పుష్ప పరిచయం చూస్తే సినిమా ఎక్కడా తగ్గేదేలా అన్నట్టే ఉంటుందని చెప్పేశారు సుకుమార్.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :