ఫస్ట్ లుక్ తోనే బన్నీ రికార్డుల వేట మొదలైంది.

Published on Apr 9, 2020 1:41 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రికార్డులు మొదలుపెట్టారు. ఆయన పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ట్విట్టర్ లో రికార్డు నమోదు చేసింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన 20వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ మాస్ అండ్ రఫ్ లుక్ విశేష ఆదరణ దక్కించుకుంది. బన్నీ నయా అవతారం ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. కాగా ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ అందుకున్న ఫస్ట్ లుక్ గా పుష్ప నిలిచింది. తెలుగు చిత్రాలలో ఎక్కువ ట్విట్టర్ లైక్స్ దక్కించుకున్న మూవీగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది.

దీనితో తమ హీరో ఫస్ట్ లుక్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టారు అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. బన్నీ-సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More