“పుష్ప” టీం కూడా సిద్దమయ్యిపోయారట.!

Published on Jun 30, 2021 5:01 pm IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ మోస్ట్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుండగా వాటిలో పార్ట్ 1 ఇప్పుడు ఫైనల్ స్టేజ్ షూట్ లో ఉంది.

ఇక మరి ఇప్పుడు మెల్లగా లాక్ డౌన్ 2.0 ఎత్తివేత అనంతరం షూటింగ్ స్టార్ట్ అవుతున్న అనేక చిత్రాల్లో పుష్ప మేకర్స్ కూడా ఓ డేట్ ఫిక్స్ చేసుకుని షూట్ కోసం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. వచ్చే జూలై మొదటి వారం 5వ తారీఖు నుంచి పుష్ప మొదలు కానుందట. ఇక అక్కడ నుంచి నాన్ స్టాప్ షూట్ ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సాలిడ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :