బన్నీకి ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ..?

Published on Apr 8, 2020 11:33 am IST

టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ నేడు పుట్టిన రోజు సంధర్భంగా తన 20వ చిత్ర అప్డేట్ పంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మాస్ లుక్ లో ఉన్న బన్నీ మూవీకి పుష్ప అనే సాఫ్ట్ టైటిల్ పెట్టడం ఆసక్తి రేపుతోంది. ఐతే ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుందని తెలుస్తుంది. పుష్ప టైటిల్ లోగోలు మొత్తం ఐదు భాషలలో విడుదల చేశారు.

హిందీతో పాటు, సౌత్ ఇండియాలోని నాలుగు భాషలలో ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. దీనితో పుష్ప అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కానున్నట్లు తెలుస్తుంది. ఎప్పటి నుండో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అతని నుండి పాన్ ఇండియా మూవీ కోరుకుంటుండగా, అది ఈ చిత్రంతో తీరనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More