“పుష్ప” అప్పటికి సగం పూర్తవుతుందట.?

Published on Feb 4, 2021 11:04 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

కొన్ని నెలల కితమే షూటింగ్ ను మొదలు పెట్టిన ఈ చిత్రం యాక్షన్ సీన్లు ఓ సాంగ్ కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే లేటెస్ట్ గా మారేడుమిల్లి అడవుల్లో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సగానికి ఎప్పుడు చేరుకుంటుందో తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ అనంతరం మరి రెండు షెడ్యూల్స్ ఉన్నాయట. వాటిలో కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకోవడంతో ఈ చిత్రం సగం మేర పూర్తయ్యిపోతుంది అట. దీనికి బహుశా మరో రెండున్నర నెలలు సమయం మేర పట్టొచ్చని తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :