బన్నీ-సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ పుష్ప పై ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. ఈ మూవీతో బన్నీ బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా…బన్నీ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. కాగా పుష్ప మూవీపై ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.
ఈ మూవీలో బన్నీ రోల్ రెండు భిన్న షేడ్స్ కలిగి ఉంటుందట. అలాగే బన్నీ పాత్రలోని ఊహించని ట్విస్ట్ సినిమాకు హైలెట్ అట. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ఆ ట్విస్ట్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని సమాచారం. మొత్తంగా పుష్ప మూవీతో సుకుమార్ ఓ భారీ హిట్ కొట్టాలని పక్కా ప్రణాళికతో ఉన్నారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.


