ప్రస్తుతం టాలీవుడ్ లో మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ ఊపందుకుంటోంది. ఇప్పటికే పలు సినిమాలు వచ్చి వెళ్ళగా, పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇటీవలే కింగ్ నాగార్జున – తమిళ హీరో కార్తీ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అధికారికంగా తెలియజేశాము. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 2 తో బిజీగా ఉంటే, కార్తీ ‘కొంబన్’ అనే మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు.
వీరిద్దరూ ఈ రెండు షూటింగ్స్ ఫినిష్ చెయ్యగానే ఈ మల్టీ స్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా కోసం తమన్నాని హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇద్దరు హీరోలు ఉన్న ఈ సినిమాలో ఒకే హీరోయిన్ ఉంటుందని కూడా అంటున్నారు. భారీ చిత్రాల నిర్మాత పరమ్ వి పొట్లూరి పివిపి బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.


