రవితేజ “రావణాసుర” ప్యార్ లోన పాగల్ సాంగ్ ప్రోమో రిలీజ్!

Published on Feb 16, 2023 5:01 pm IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. ఈ చిత్రం లో యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్ 7, 2023 న థియేటర్ల లో విడుదల చేయనున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ప్యార్ లోన పాగల్ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ ప్రోమో కి సంబంధించిన పూర్తి పాట ఫిబ్రవరి 18 న విడుదల కానుంది. అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో లు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :