ముగింపు దశలో ‘క్వీన్‌ 2’.. కొత్త సినిమా పై కంగనా రియాక్షన్ !

ముగింపు దశలో ‘క్వీన్‌ 2’.. కొత్త సినిమా పై కంగనా రియాక్షన్ !

Published on Jun 29, 2026 6:31 PM IST

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘క్వీన్‌’ సినిమా 2013లో విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘క్వీన్‌ 2’ రాబోతుంది. ఈ సినిమాకి వికాస్‌ బల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది. తాజాగా శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని, జులై మొదటి వారంలో ఈ సినిమా షూట్ ముగుస్తుందని తెలుస్తోంది.

ప్రస్తుతం కంగనా రనౌత్‌ కు సంబంధించిన కొన్ని భావోద్వేగ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి వచ్చే వారంతో ఈ సినిమా పూర్తి కానుంది. ఇక కంగనా తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఓ కథ పై వర్క్ జరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది’ అని కంగనా తెలిపింది. పెళ్లి పై మీ అభిప్రాయం ఏమిటి ? అని అడగగా.. ‘నా పెళ్లి పై ఇప్పటికే ఎన్నో వార్తలు రాశారు. వాటిల్లో ఒక్కటి కూడా నిజం లేదు. పెళ్లి, పిల్లలు అనేవి నాకు సూట్ కావు’ అంటూ కంగనా రనౌత్ క్లారిటీ ఇచ్చింది.

తాజా వార్తలు