పీపుల్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి అరెస్ట్ !

Published on Jun 28, 2021 9:16 pm IST


పీపుల్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి అరెస్ట్ అయ్యారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నారాయణ మూర్తి ని ఎందుకు అరెస్ట్ చేశారంటే.. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త‌ రైతు చ‌ట్టాల పై కొన్ని రోజుల నుంచి రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్నారు. తాజాగా రైతులు చ‌లో రాజ్‌భ‌వ‌న్ అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. కాగా ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి కూడా రైతుల‌కు త‌న మ‌ద్దుతుని తెలియజేస్తూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఐతే ఈ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేదు. అందుకే పోలీసులు ఆందోళ‌న చేస్తున్న వారిని అరెస్ట్ చేసి తరలించారు. అలా అరెస్ట్ అయిన వారిలో ఆర్.నారాయ‌ణ‌మూర్తి కూడా ఉన్నారని తెలుస్తోంది. కాగా కేంద్ర ప్ర‌భుత్వం చేసిన కొత్త రైతు చ‌ట్టాల కార‌ణంగా రైతులు కూలీలుగా మారుతున్నార‌ని ఈ సంద‌ర్భంగా నారాయణమూర్తి విచారణ వ్యక్తం చేస్తూ.. దయచేసి ఆ చ‌ట్టాల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత సమాచారం :