లాక్ చేసిన ‘రా రా కృష్ణయ్య’ రన్ టైం

లాక్ చేసిన ‘రా రా కృష్ణయ్య’ రన్ టైం

Published on Jul 2, 2014 12:24 PM IST

Ra-Ra-Krishnayya
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా, అందాల భామ రెజీన కసాండ్ర హీరోయిన్ గా తెరకెక్కి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ‘రారా కృష్ణయ్య’. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో సందీప్ కిషన్ – రెజీన లిప్ లాక్ వల్ల ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైంని ఈ చిత్ర టీం లాక్ చేసారు. ఈ సినిమా నిడివి 140 నిమిషాలు.

సందీప్ కిషన్ కి అన్న పాత్రలో జగపతి బాబు కనిపిస్తున్న ఈ సినిమా ద్వారా మహేష్ బాబు.పి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. జగపతి బాబుకి జోడీగా కళ్యాణి కనిపిస్తున్న ఈ సినిమాకి వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సందీప్ కిషన్ ఈ సినిమాతో కూడా మరో హిట్ అందుకుంటానని చాలా నమ్మకంగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు