సందీప్ కిషన్ మరియు రెజినా జంటగా నటిస్తున్న ‘రారా కృష్ణయ్య’ సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాను ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించామని కాబట్టి సినిమా విజయం ఖాయమని చిత్ర బృందం వాదన.
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ వున్న సినిమాలదే హవా కావడంతో అందరూ ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఈ చిత్రానికి రెజినా గ్లామర్, ఈ మధ్యే వెలుగులోకి వచ్చిన హాట్ కిస్ సీన్ సినిమాపై అంచనాలను మరింతపెంచాయి. జగపతిబాబు సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
పి మహేష్ బాబు దర్శకుడు. ఎస్.వి.కే సినిమా బ్యానర్ నిర్మాత. సందీప్ ఈ సినిమాతో హిట్ కొడితే మంచి పొజిషన్ కు చేరుకుంటాడని అందరి విశ్లేషణ.


