వైజాగ్ లో షూటింగ్ జరుపుకొంటున్న రారా కృష్ణయ్య

వైజాగ్ లో షూటింగ్ జరుపుకొంటున్న రారా కృష్ణయ్య

Published on Apr 29, 2014 11:51 PM IST

rara-krishnayya
సందీప్ కిషన్, రెజినా జంటగా నటిస్తున్న ‘రారా కృష్ణయ్య’ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఎస్వీకె బ్యానర్ పై వంశీ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో, సందీప్ కిషన్ కు అన్నగా జగపతి బాబు కనిపించనున్నారు.

సందీప్ కిషన్, రెజినా మధ్య ఇటీవలే ఓ పాట కు సంబంధించిన షూటింగ్ వైజాగ్ లో జరుపుకొంది. ప్రస్తుతం ఆర్కే బీచ్ లో సందీప్ కిషన్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొదటి సారి సందీప్ కిషన్ పూర్తి గా మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల సందీప్ కిషన్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా తనకు కావలసిన విధంగా యాక్షన్ సన్నివేశాలు వచ్చినట్లు తెలిపారు.

శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అచ్చు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు