ఇంటర్వ్యూ : రాయ్ లక్ష్మీ – ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ మంచి కామెడీ ఎంటర్టైనర్ !

Published on Feb 18, 2019 5:48 pm IST


నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రగా రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. కాగా ఈ చిత్రం ట్రైలర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల అవ్వనుంది. కాగా ఈ సందర్భంగా రాయ్ లక్ష్మీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

చాలా లాంగ్ గ్యాప్ తరువాత తెలుగులో సినిమా చేస్తున్నారు ?

అవును. చాలా గ్యాప్ వచ్చేసింది. ఇది కావాలని తీసుకున్న గ్యాప్ కాదు.

ఈ సినిమా గురించి చెప్పండి ? అసలు ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’కి మీనింగ్ ఏమిటి ?

సినిమా చూశాకే ఆ పేరుకి, సినిమాకి మధ్య ఉన్న కనెక్షన్ మీకు అర్ధమవుతుంది. అయితే ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ ఇంగ్లీష్ టైటిల్ అయినా.. తెలుగు సినిమానే, సినిమాలో చాలా మంచి ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది. అలాగే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇక వెంకటలక్ష్మి’ అంటే.. సినిమాలో నా క్యారెక్టర్ పేరు.

మీరు టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ?

నేను సినిమాలో వెంకటలక్ష్మిగా కనిపిస్తాను, వెంకటలక్ష్మి ఒక స్కూల్ టీచర్. వెంకటలక్ష్మి ఎవరు ? తన లైఫ్ లో తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..ఇలా వాటి మీదే కథ సాగుతుంది. నేను ఫస్ట్ టైం స్క్రిప్ట్ విన్నప్పుడు.. నాకు చాలా బాగా నచ్చింది. స్క్రిప్ట్ లో కామెడీతో పాటు సస్పెన్స్ కూడా చాలా బాగుంది.

మీరు చేసిన ఐటమ్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. వాటి గురించి చెప్పండి ?

జూలీ 2 షూటింగ్‌ టైంలో మెగాస్టార్ చిరంజీవిగారి పక్కన రత్తాలు సాంగ్ లో నటిస్తారా అని ఆఫర్ వచ్చింది. రత్తాలు పాటకు అంతటి హ్యూజ్ స్పందన వస్తుందని నేను ఊహించలేదు. ఒక్క సాంగ్ కే నేను అలాంటి రెస్పాన్స్‌ను సొంతం చేసుకోవడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఇక చిరంజీవిగారు 150 ఫిల్మ్ లో ఒక స్పెషల్ సాంగ్ చెయ్యటం చాలా బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్. అలాగే పవన్ కళ్యాణ్ గారి పక్కన చెయ్యడం కూడా.

బాలీవుడ్ లో అకీరా, జూలీ 2 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఏమైనా సినిమాలు చేస్తున్నారా ?

కొన్ని అవకాశాలు వచ్చాయి, కాకపోతే ఇంతవరకూ ఏది అంగీకరించలేదు. కానీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా చేస్తాను. ఐతే బాలీవుడ్ ఇండస్ట్రీ.. మన సౌత్ ఇండస్ట్రీ కంటే కాస్త బిన్నంగా ఉంటుంది.

‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ దర్శకుడు కిషోర్ కుమార్ గురించి చెప్పండి ?

కిషోర్ కుమార్ సెట్ లో చాలా సరదాగా ఉంటారు. వెరీ హార్డ్ వర్కర్. రోజూకి రెండు మూడు షిఫ్ట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందరం ఫ్రెండ్స్ లా కలిసి చేశాము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హరి గోరా వర్క్ కూడా అమేజింగ్, ఆయన కంపోజ్ చేసిన అన్నీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ప్రస్తుతం మీరు చేస్తోన్న సినిమాలు గురించి అలాగే మీ తదుపరి సినిమాలు గురించి కూడా చెప్పండి ?

ప్రస్తుతం మూడు తమిళ్ సినిమాలు అలాగే ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. అదేవిధంగా ఇదివరకూ అంగీకరించిన ఒక తెలుగు సినిమా కూడా ఉంది. ఫస్ట్ ఈ సినిమాలు పూర్తి అయ్యాకే మిగితా సినిమాల ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం :

X
More