హిందీ, మలయాళంలో విడుదలకు సిద్ధమవుతున్న రాయ్ లక్ష్మీ ‘జనతా బార్’

హిందీ, మలయాళంలో విడుదలకు సిద్ధమవుతున్న రాయ్ లక్ష్మీ ‘జనతా బార్’

Published on Jan 28, 2026 11:00 AM IST

Janatha-Bar

రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘జనతా బార్’. అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ బ్యానర్‌

రూపొందిన ఈ సినిమా, గత ఏడాది విడుదలై తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కన్నడలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రాన్ని, త్వరలోనే హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని భాషల్లో థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే సినిమా ఓటీటీలోకి రానుంది.

క్రీడా రంగంలో మహిళలపై జరిగే వేధింపులు, వారికి ఎదురయ్యే చేదు అనుభవాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ రివేంజ్ డ్రామాగా మలిచారు. తన సోదరికి జరిగిన అన్యాయానికి కథానాయిక ఎలా ప్రతీకారం తీర్చుకుందనేది ఈ చిత్ర ఇతివృత్తం. ఇందులో అమీక్షా పవర్, అమన్ ప్రీత్ సింగ్, శక్తి కపూర్, దీక్షా పంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వినోద్ యజమాన్య సంగీతాన్ని అందించగా, డ్రాగన్ ప్రకాష్ ఫైట్స్ కంపోజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు