‘రాకా’పై బన్నీ క్రేజీ అప్‌డేట్ ఇస్తాడా?

‘రాకా’పై బన్నీ క్రేజీ అప్‌డేట్ ఇస్తాడా?

Published on Nov 15, 2026 11:00 AM IST

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ కలయికలో రాబోతున్న సినిమా ‘రాకా’. ఈ సినిమా షూటింగ్‌లో అల్లు అర్జున్ పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా గురించి చిత్ర నిర్మాతలు ఇప్పటివరకు చాలా తక్కువ వివరాలు వెల్లడించారు, దీంతో అభిమానులు మరిన్ని అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈరోజు, అల్లు అర్జున్ హైదరాబాద్‌లో జరిగే ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కానున్నారు.

ఈ సందర్భంగా అభిమానులు, ‘రాకా’ సినిమాపై ఆయన ఒక ఖచ్చితమైన అప్‌డేట్ పంచుకుంటారని ఆశిస్తున్నారు. మరి బన్నీ ఎలాంటి అప్ డేట్ చెబుతారో చూడాలి. ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

తాజా వార్తలు