‘రాకా’ అప్‌డేట్: తన పాత్ర పై నటుడు క్లారిటీ !

‘రాకా’ అప్‌డేట్: తన పాత్ర పై నటుడు క్లారిటీ !

Published on Sep 6, 2026 10:00 AM IST

కొద్ది రోజుల క్రితం ‘రాకా’ చిత్రం గురించి ఆన్‌లైన్‌లో విస్తృతంగా చర్చ జరిగింది, ఈ సినిమా 2027 డిసెంబర్ 31న విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా, దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటుడు ఈ చిత్రంలో ఓ పాత్రలో నటించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. ఆ నటుడు బబ్లూ పృథ్వీరాజ్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

ఓ ఇంటర్వ్యూలో, బబ్లూ పృథ్వీరాజ్ ‘రాకా’ షూటింగ్ సెట్‌లో తన అనుభవాలను మరియు తన పాత్ర గురించి పంచుకుంటూ.. ఈ ప్రాజెక్ట్‌లో తనకు ఒక ప్రత్యేకమైన లుక్‌తో కూడిన కీలక పాత్ర దక్కిందని చెప్పారు. అలాగే, దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయడం అదృష్టం అని, ఇక అల్లు అర్జున్‌తో కలిసి ఇంత భారీ స్థాయి చిత్రంలో భాగం కావడం తన కల సాకారం కావడమేనని బబ్లూ పేర్కొన్నారు.

ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

తాజా వార్తలు