యంగ్ హీరోకు జోడిగా రాశిఖన్నా !

Published on Feb 19, 2019 10:03 pm IST

యువ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులముందుకు రాగ ఒక్కటి కూడా విజయం సాదించలేకపోయింది. దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని కోలీవుడ్ మూవీ ‘రాక్షసన్ ‘రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. రైడ్ ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయి కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ను కానీ రాశి ఖన్నా ను గాని తీసుకోనున్నట్లు గా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ఒరిజినల్ వెర్షన్ లో అమలా పాల్ పోషించిన పాత్రలో రాశి ఖన్నా నటించనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి తమిళంలో గత ఏడాది విడుదలై సూపర్ హిట్ అయినా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఇక సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత అనే చిత్రంలో నటిస్తున్నాడు. కవచం తరువాత సాయి -కాజల్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :