నేను ఎవరితో ప్రేమలో లేను – రాశి ఖన్నా

నేను ఎవరితో ప్రేమలో లేను – రాశి ఖన్నా

Published on Jun 7, 2020 3:00 AM IST


లవ్లీ బ్యూటీ రాశి ఖన్నా తను ఎవరితోనో ప్రేమలో ఉన్నానంటూ వస్తున్న వార్తల పై స్పందిస్తూ… ‘నేను ప్రేమలో ఉన్నానని వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు. ఇక నాకు కాబోయే వాడి విషయంలో ఎటువంటి కోరికలు కూడా నాకు లేవు. ప్రస్తుతం నా మనసుకు నచ్చేవాడి గురించి ఆలోచించేంత టైమ్ కూడా నాకు లేదు. నేను కెరీర్‌ పైనే నా దృష్టి అంతా పెట్టాను.

ఇక సినిమాలు కాకుండా నాకు ఆధ్యాత్మికత, పుస్తకాలతోనే టైం గడిచిపోతుందని అన్నారు. దయచేసి ఇటువంటి రూమర్లు పుట్టించవద్దని ఆమె కోరారు. ఇక ఐటివలె అభిమానుల కోరిక మేరకు సరదాగా ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది రాశీ. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులు గురించి అని అడగగా.. ‘తెలుగు ప్రేక్షకులు నా ప్రాణం’ అంటూ రాశి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు