ఇంటర్వ్యూ : రాశి ఖన్నా – సినిమా చూశాకా నేను మా డైరెక్టర్ గారి పాదాలను తాకాను !

Published on Aug 6, 2018 2:43 pm IST

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సంధర్బంగా ఈ చిత్ర హీరోయిన్ రాశి ఖన్నా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

ఈ చిత్రంలో ప్రధానంగా ఏ అంశాలు చూసి మీరు ఈ చిత్రం అంగీకరించారు ?
తొలిప్రేమ సినిమా తర్వాత నేను మళ్ళీ మంచి సినిమానే చెయ్యాలి, నన్ను నేను కొత్తగా చూపించుకునే సినిమానే చెయ్యాలి అని ఎదురు చూస్తున్న సమయంలో దర్శకుడు సతీష్ వేగేశ్నగారు ‘శ్రీనివాస కళ్యాణం’ స్క్రిప్ట్ తో వచ్చారు. ఆయన నాకు కథ చెప్పిన వెంటనే ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. సినిమాలో పెళ్లి గొప్పదనం గురించే కాదు, మంచి అనుంబంధాలు కూడా ఉంటాయి. కథ విన్న వెంటనే ఈ సినిమా నేను చేస్తున్నానని చెప్పేశాను, నేను కథకు అంత బాగా కనెక్ట్ అయ్యాను.

మిమ్మల్ని అంతగా కనెక్ట్ చేసిన ఈ సినిమా గురించి చెప్పండి ?
ఇది తొందరగా పెళ్లి చేసేసుకోవాలి అనే ఓ ఆసక్తిని ప్రేరేపించే ఓ అందమైన ప్రేమ కథ అని చెప్పొచ్చు. ఈ చిత్రం పూర్తిగా కుటుంబ భావోద్వేగాలతో, మన బంధువుల మధ్య అనుబంధాలను గుర్తుకు తెచ్చుకునేంతగా గొప్ప సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి.

మీరు పూర్తి సినిమా చూశారా ?
నిన్న రాత్రి మా టీమ్ తో కలిసి ఈ చిత్రం చూడటం జరిగింది. మనసుకు హత్తుకుపోయేలా ఉంటుంది సినిమా. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ మనలోని ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది. నిజంగా దర్శకుడు సతీష్ గారు తన స్క్రిప్ట్ తో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు.

మరి ఇంత బాగా చిత్రాన్ని తెరకెక్కించిన సతీష్ వేగేశ్నగారికి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏమిటి ?
నేను ఈ సినిమా చూసిన వెంటనే ఎమోషనలై మా డైరెక్టర్ సతీష్ వేగేశ్నగారి పాదాలను తాకాను. ఇప్పటికి నేను సినిమాలోంచి బయటకు రాలేదు. 9న థియేటర్లలో సినిమాని చూశాక ప్రేక్షకులు కూడా నాలాగే ఫీల్ అవుతారు.

ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?
ఈ సినిమాలో నా పాత్ర పేరు సిరి. ఫ్యామిలీ ఓరియంటెడ్ గర్ల్. ఫెర్ఫామెన్స్ కి ఎంతో స్కోప్ ఉన్న పాత్ర ఇది. నేను కూడా నా పాత్ర పరిధి మేరకు బాగానే నటించాను అనుకుంటున్నాను. రేపు సినిమా విడుదల అయ్యాక మీరు సినిమా చూశాక ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లోకల్లా నా బెస్ట్ ఫెర్ఫామెన్స్ అని మీరే అంటారు.

మీ హీరో నితిన్ గురించి చెప్పండి ?
తను కో ఆర్టిస్ట్ లకు చాలా బాగా సహకరిస్తాడు. మేం సెట్ కి వెళ్లబోయే ముందే డైలాగ్స్ మొత్తం ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళం. క్లైమాక్స్ సీక్వెన్స్ లో నితిన్ అద్భుతంగా నటించాడు.

మీ తరువాతి ప్రాజెక్ట్ లు ఏమిటి ?
తెలుగులో అయితే ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేశాను, ఆ చిత్రానికి సంబంధించి త్వరలోనే ఆ చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారు. ఇది కాకుండా, తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :

More