రాశీఖన్నా నిజంగానే అద్భుతం సృష్టిస్తోంది

Published on Jun 16, 2021 2:02 am IST

కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక అనేకమంది ఆకలితో అలమటిస్తున్నారు. ఒకవైపు వైరస్ భయపెడుతుంటే మరోవైపు ఆకలి బాధలు వేధిస్తున్నాయి. అందుకే పలువురు ప్రముఖులు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ ఆకలి బాధలు తీర్చడానికి ముందుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా కూడ ఇదే చేస్తున్నారు. రోటీ బ్యాంక్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆకలితో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. నిజానికి రాశీఖన్నా చాలారోజుల నుండి బీ ద మిరాకిల్ పేరుతో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నా కూడ ఈమధ్యనే ఈ విషయాన్ని బయటపెట్టారు.

కేవలం తను మాత్రమే చేస్తే కొద్దిమందికే సహాయం అందుతుందని అదే అనేకమంది కలిస్తే ఇంకా ఎక్కువమంది ఆకలి తీర్చవచ్చనే ఉదేశ్యంతో ఇతరులను మోటివేట్ చేయడానికి తాను చేస్తున్న సేవా కార్యక్రమాన్ని గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ వివరించి విరాళాలు కోరారు. ఒక్క 40 రూపాయలు డోనేట్ చేస్తే ఒక పూట ఒకరి ఆకలి తీర్చినవారం అవుతామంటూ క్యాంపైనింగ్ మొదలుపెట్టారు. ఆమె పిలుపుతో అనేకమంది విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ డబ్బుతో హైదరాబాద్ సిటీలో ప్రతిరోజూ సుమారు 1200 మంది ఆకలిని తీరుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది రాశీఖన్నా.

సంబంధిత సమాచారం :