
స్టార్ డైరెక్టర్ అండ లేకపోయినా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘రభస’ విడుదలకు ముందే మంచి బిజినెస్ చేసుకొస్తుంది. సమాచారం ప్రకారం కొన్ని ఏరియాలలో ఇప్పటికే ఈ సినిమా షేర్ లు భారీ ధరలకు అమ్ముడయిపోయాయి
చాన్నాళ్ళుగా ఒక భారీ హిట్ బాకీ వున్న ఎన్.టి.ఆర్ ఈ సినిమా ద్వారా ఆ కల నెరవేరుస్తాడని పంపిణీదారులు ఆశను వ్యక్తంచేస్తున్నారు. సమంత ఈ సినిమాలో కధానాయిక. వీరి కలయికలో వస్తున్న మూడవ సినిమా ఇది. ప్రణీత ఈ చిత్రంలో మరో కధానాయిక
రభస సినిమాకు బెల్లంకొండ సురేష్ నిర్మాత. శ్రీనివాస్ దర్శకుడు. తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ఆగష్టు 14న విడుదలకానుంది