డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్న ‘రభస’ టీం

డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్న ‘రభస’ టీం

Published on Jun 26, 2014 11:54 AM IST

Rabhasa

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – బ్యూటిఫుల్ సమంత జంటగా నటిస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా డబ్బింగ్ చెబుతున్నారు. త్వరలోనే ఎన్.టి.ఆర్ కూడా తన పార్ట్ కి డబ్బింగ్ మొదలు పెట్టనున్నాడు.

జూలై మూడవ వారంలో ఆడియోని రిలీజ్ చేసి, సినిమాని ఆగష్టు 14న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్ సంగీతమా న్దిస్తున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫుల్ కామెడీ కూడా ఉంటుందని సమాచారం.

తాజా వార్తలు