ఇటలీలో రభస చేస్తున్న ఎన్.టి.ఆర్

Published on Jul 9, 2014 4:30 pm IST

Rabhasa
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం చేస్తున్న ‘రభస’ సినిమాని శరవేగంగా పూర్తి చేసి అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చేసేలా చూస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ టాకీ పార్ట్ ని మొత్తం పూర్తి చేసారు. ఇక ఈ సినిమాలో ఒక పాట మాత్రమే బాలన్స్ ఉంది. ఈ పాటని షూట్ చేయడం కోసం ఈ చిత్ర టీం ఇటలీ బయలుదేరారు. ఈ పాట షూట్ చేసుకొని తిరిగి వచ్చాక పాచ్ వర్క్ సీన్స్ ని ఫినిష్ చేస్తారు.

ఇటలీ నుంచి తిరిగి రాగానే ఎన్.టి.ఆర్ కూడా తన పార్ట్ కి డబ్బింగ్ చెప్పడం మొదలు పెడతాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ఆడియోని జూలై చివరి వారంలో రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్. ఎన్.టి.ఆర్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :