యుఎస్ బాక్స్ ఆఫీసుని కొల్లగొట్టిన ‘రేసు గుర్రం’

యుఎస్ బాక్స్ ఆఫీసుని కొల్లగొట్టిన ‘రేసు గుర్రం’

Published on Apr 15, 2014 12:09 AM IST

Race-Gurram1
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రేసు గుర్రం’ విడుదలైన అన్నిచోట్లా కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేస్తోంది. జులాయి మొత్తంగా కలెక్ట్ చేసిన గ్రాస్ ని రేసు గుర్రం మొదటి వీకెండ్ లోనే టచ్ చేసి 1 మిలియన్ వైపు దూసుకెలుతోంది. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్, శృతి హాసన్ గ్లామర్, కిల్ బిల్ పాండేగా బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను థియేటర్ కి రాబట్టు కుంటోంది. మొదటి వారం వీకెండ్ యుఎస్ లో వచ్చిన కలెక్షన్స్ రిపోర్ట్ మీకందిస్తున్నాం..

గురువారం ప్రీమియర్ షో – $ 102K

శుక్రవారం – $ 205K

శనివారం – $ 320K

ఆదివారం – $ 215K

మొత్తం – $ 842K (ఇండియా ప్రకారం సుమారు 5 కోట్ల పైనే)

తాజా వార్తలు