కలెక్షన్స్ అదరగొడుతున్న ‘రేసు గుర్రం’

కలెక్షన్స్ అదరగొడుతున్న ‘రేసు గుర్రం’

Published on Apr 13, 2014 2:15 PM IST

Race-Gurram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసు గుర్రం’ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి వారం వీకెండ్ కలెక్షన్స్ లో అల్లు అర్జున్ కెరీర్లోని గత సినిమాల రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని అంటున్నారు.

మొదటి వీకెండ్ ముగిసేలోపు నైజాం లో 5 కోట్ల మార్క్ ని, అలాగే సీడెడ్ లో 3 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని సమాచారం. అలాగే ఓవర్సీస్ లో కూడా సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్, బ్రహ్మానందం కామెడీ ప్రధాన హైలైట్.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కిక్ శ్యామ్, సలోని, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. వక్కంతం వంశీ కథని అందించిన ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా, నల్లమలపు బుజ్జి నిర్మించాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు