ఏప్రిల్ 11న విడుదలకానున్న రేస్ గుర్రం

Published on Mar 23, 2014 12:04 am IST

Race-Gurram

అల్లు అర్జున్, శ్రుతిహాసన్ లు జంటగా నటించిన రేస్ గుర్రం సినిమా ఏప్రిల్ 11న విడుదలకానుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర దశలో వుంది. అల్లు అర్జున్, శృతిహాసన్ మరియు సురేందర్ రెడ్డి మొదటిసారిగా కలిసి నటిస్తున్నా గానీ ఈ సినిమా పై భారీ అంచనాలే వున్నాయి

ఈరోజు రాజమండ్రీ గైట్ కాలేజి కార్యక్రమానికి అతిధిగా ఆహ్వానించిన నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని అక్కడ విడుదల చేశారు. సంగీతదర్శకుడు తమన్ తో కలిసి హీరో, డైరెక్టర్ లు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. బ్రహ్మానందం కీలకపాత్ర పోషించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్రేక్షులను అలరిస్తాడని సమాచారం

సలోని, రవికిషన్ ముఖ్యపాత్రధారులు. నల్లమలపు బుజ్జి, వెంకటేశ్వర రావు నిర్మాతలు

సంబంధిత సమాచారం :