షాకింగ్..’టైటానిక్’ క్లైమాక్స్ ని తలదన్నేలా “రాధే శ్యామ్”..?

Published on Mar 3, 2022 11:00 am IST

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సినిమా “రాధే శ్యామ్” కూడా ఒకటి. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది మొదటి నుంచి కూడా చాలా ఆసక్తిగా ఉన్న అంశం. అయితే మూడేళ్ళ కితం ఈ సినిమా స్టార్ట్ అయ్యినప్పుడు ఒక అద్భుతమైన పీరియాడిక్ ప్రేమకథగా ఉంటుందని మాత్రమే తెలుసు.

కానీ నెమ్మదిగా రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ సినిమాపై మరిన్ని ఆసక్తికర అంశాలు బయటకి రావడం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేదిలా మారాయి. అయితే ఈ భారీ సినిమాలో తర్వాత ఓ షిప్ సీక్వెన్స్ కూడా ఉందని టాక్ రావడం, పైగా లవ్ స్టోరీ లో షిప్ సీక్వెన్స్ అంటే మొదటగా వరల్డ్ బిగ్గెస్ట్ హిట్ “టైటానిక్” సినిమానే అందరికీ గుర్తు వచ్చింది.

అయితే రాధే శ్యామ్ పై కూడా ఆ రేంజ్ లోనే అంచనాలు నెలకొన్నాయి కానీ అప్పుడు మేకర్స్ అయితే టైటానిక్ కి దీనికి సంబంధం లేదని కన్ఫర్మ్ చేసారు. కానీ లేటెస్ట్ గా అయితే ఆస్కార్ విన్నర్ రేసుల్ చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయని చెప్పాలి. ఈ సినిమా క్లైమాక్స్ టైటానిక్ ని మించి ఉంటుందని ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్ చెప్పడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారిపోయింది.

ఇప్పటికే రెండో ట్రైలర్ లో విజువల్స్ వేరే లెవెల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ షిప్ సీక్వెన్స్ కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. మరి వేచి చూడాలి రాధే శ్యామ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో అనేది.

సంబంధిత సమాచారం :