మళ్ళీ మరింత అప్లాజ్ అందుకుంటున్న “రాధే శ్యామ్”.!

మళ్ళీ మరింత అప్లాజ్ అందుకుంటున్న “రాధే శ్యామ్”.!

Published on Apr 1, 2022 8:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాదికి ఫస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా రిలీజ్ గా వచ్చింది. అయితే కంప్లీట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ భారీ సినిమా మాస్ ఆడియెన్స్ విషయంలో మిస్ ఫైర్ అయ్యి అనుకున్న స్థాయి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది.

జస్ట్ అది మినహాయిస్తే మాత్రం చిత్ర యూనిట్ కి మాత్రం జెనరల్ ఆడియెన్స్ నుంచి మాత్రం అప్పుడు మంచి అప్లాజ్ దక్కింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రాగా ఇక్కడ నుంచి మళ్ళీ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ అందుతుండడం విశేషం. అలాగే మరికొంతమంది అయితే ఓటిటి లో ఎక్స్ పీరియన్స్ మరింత బాగుందని మరికొందరు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు