ప్రభాస్ ఆర్మీపై “రాధే శ్యామ్” కంపోజర్ అదిరే వ్యూ..!

Published on Jun 20, 2021 9:39 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న “రాధే శ్యామ్” చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఇంకొన్ని రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉన్న ఈ చిత్రం షూట్ పై లేటెస్ట్ బజ్ కూడా బయటకి వచ్చింది. అన్ని భాషల్లోని ఈ చిత్రం తాలుకా మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు రెడీగా ఉందని టాక్ మొదలయ్యింది.

అయితే ఈ సమయంలోనే ఈ చిత్రానికి హిందీ ఆల్బమ్ అందిస్తున్న సంగీత దర్శకుల్లో ఒకరైన మనన్ భరద్వాజ్ ప్రభాస్ కోసం తన ఫాలోయింగ్ కోసం తన ఇన్స్టా ద్వారా చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కి తన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాని తన జీవితంలోనే ఇప్పటి వరకు ప్రభాస్ కు ఉన్న లాంటి పెద్ద ఫ్యాన్ ఆర్మీ ఎక్కడా ఏ హీరోకి కూడా చూడలేదని తెలిపాడు. ఇవన్నీ చూస్తుంటే రాధే శ్యామ్ నుంచి త్వరలోనే మ్యూజికల్ ఫీస్ట్ స్టార్ట్ అయ్యేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :