“రాధే శ్యామ్” టీం ఈ స్పెషల్ ప్లాన్ లో కూడా ఉన్నారా.?

Published on Feb 25, 2021 10:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన వింటేజ్ లవ్ స్టోరీ చిత్రం “రాధే శ్యామ్” విడుదలకు రెడీ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా కోసం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సినిమా వరకు వెళ్లకుండా ఈ గ్యాప్ లో మంచి మంచి అప్డేట్స్ రావాలని కోరుకుంటున్నారు.

అయితే ఇటీవలే ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ దీని తర్వాత టీజర్ కూడా ఉంటుంది అని ఒక అంచనా ఏర్పడింది. అయితే ఇది పక్కన పెడితే మాత్రం ఈ సినిమాలో అన్నటికన్నా స్పెషల్ గా వినిపిస్తుంది మాత్రం ఈ వండర్ ఫుల్ మ్యూజిక్ ఆల్బమ్ కోసమే..

మొత్తం ముగ్గురు సంగీత దర్శకులు ప్లాన్ చేస్తున్న ఈ ఆల్బమ్ పై కొన్ని రోజుల నుంచి మంచి బజ్ వినిపిస్తుంది. మరి అలా ఇప్పుడు ఫస్ట్ సింగిల్ విషయంపై మేకర్స్ దృష్టి పెట్టినట్టు సరికొత్త బజ్ మొదలయ్యింది. దీనికి సంబంధించి కూడా ఏదొక అప్డేట్ ను తొందరలోనే ఇస్తారని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం ఈ మోస్ట్ అవైటెడ్ ఆల్బమ్ ఎలా ఉంటుందో అన్న ఉత్సుకత ప్రతీ ఒక్కరిలోనూ ఉంది.

సంబంధిత సమాచారం :