ఇప్పట్లో “రాధేశ్యామ్” టీజర్ మర్చిపోవాల్సిందేనా.?

Published on Jan 16, 2021 11:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం కూడా ఇటీవలే పూర్తి కాబడిన విషయం కూడా తెలిసిందే.

అయినప్పటికీ మాత్రం ఈ సినిమా నుంచి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టీజర్ ఇంకా రాలేదు. ఈ సంక్రాంతి కానుకగా డెఫినెట్ గా వస్తుంది అనుకున్న ఈ టీజర్ ఫైనల్ గా ఎప్పటిలానే రాలేదు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరాశకు లోనయ్యారు.

అలాగే ఇప్పట్లో కూడా మళ్ళీ ఈ టీజర్ వచ్చే సూచనలు మళ్ళీ దూరం అయ్యినట్టే తెలుస్తుంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ను మేకర్స్ ఎప్పుడు వదిలి మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణకు ఎప్పుడు తెర దించుతారో చూడాలి. మరి ఈ చిత్రానికి గాను జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ మేకర్స్ వారి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :