సర్‌ ప్రైజింగ్ పోస్టర్‌ ఆకట్టుకున్న ‘రాధే శ్యామ్’ !

Published on Aug 30, 2021 10:44 am IST


ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేసింది టీమ్. కృష్ణాష్టమి సందర్భంగా వచ్చిన ఈ సర్‌ ప్రైజింగ్ పోస్టర్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్‌లో విక్రమాదిత్య – ప్రేరణలుగా ప్రభాస్ – పూజా హెగ్డే తమ లుక్స్ ఆకట్టుకుంటున్నారు.

2022, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కాగా ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్ పతాకంపై రెబల్ స్టార్ కృష్ణం రాజు – టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో యూవి క్రియేషన్స్ పతాకంపై వంశీ-ప్రమోద్-ప్రశీద భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :