‘రక్త చరిత్ర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ రాధిక ఆప్టే ‘లెజెండ్’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రాధిక ఆప్టేకి ఓ గోల్డెన్ ఆఫర్ వచ్చింది. అదే ఇంకా టైటిల్ పెట్టని ఓ బ్రిటిష్ సినిమాకి సైన్ చెయ్యడం. ఈ సినిమా కథ ఒక ఇండియన్ అమ్మాయి లండన్ వెళ్లి అక్కడ లండన్ బ్రాడ్ వేస్ లో షో చేయాలనుకునే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమా ఆడిషన్స్ లో స్కైప్ ద్వారా రాధిక ఆప్టేని సెలెక్ట్ చేసారు. ‘ఒక రోజు సడన్ గా థియేటర్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. కొద్ది రోజుల్లోనే నన్ను సెలక్ట్ చేసారు. ప్రస్తుతం నేను లండన్ లో రిహార్సల్ చేస్తున్నాను. ఒక యాక్టర్ గా ఇలాంటి అవకాశాలు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బోర్డర్ దాటి ఎంతోమంది వెరైటీ పీపుల్స్ తో సినిమాలు చేయడం ఒక యాక్టర్ గా ఎంతో సంతృప్తిని ఇస్తుందని’ రాధిక ఆప్టే అంటోంది. రాధిక ఆప్టే త్వరలో బాలకృష్ణ నటిస్తున్న ‘లయన్’ సినిమాలో నటించనుంది.


