హిందీలో హిట్ కొట్టిన బాలయ్య హీరోయిన్

హిందీలో హిట్ కొట్టిన బాలయ్య హీరోయిన్

Published on Feb 20, 2015 5:32 PM IST

Radhika-Apte
నేడు హిందీలో విడుదలైన ‘బద్లాపూర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రాధిక ఆప్టే. యాక్షన్ థ్రిల్లర్ రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో రెస్టారెంట్ ఓనర్ పాత్రలో రాధిక చక్కని నటన కనబరిచిందని విమర్శకులు ప్రశంసించారు. గతంలో ‘రక్త చరిత్ర’, ‘షోర్ ఇన్ ది సిటీ’ సినిమాలు ఆమెకు గుర్తింపు తీసుకొచ్చినా.. కమర్షియల్ బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందని రాధిక ఆప్టే భావిస్తుంది.

తెలుగులో బాలకృష్ణ సరసన నటించిన ‘లెజెండ్’తో రాధిక ఆప్టే, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మరోసారి బాలయ్య సరసన ‘లయన్’ సినిమాలో నటిస్తుంది. ఆమె చేతిలో మరో 4 హిందీ సినిమాలు ఉన్నాయి. ‘బద్లాపూర్’ విజయంతో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు