​నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డుల్లో రాగ్ మయూర్‌కు ఉత్తమ నటుడి అవార్డు

​నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డుల్లో రాగ్ మయూర్‌కు ఉత్తమ నటుడి అవార్డు

Published on Jul 20, 2026 10:00 AM IST

​ముంబైలో జరిగిన ‘నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్’ (NEXA Streaming Academy Awards) వేడుకలో తెలుగు నటుడు రాగ్ మయూర్‌ ఉత్తమ నటుడిగా (బెస్ట్ యాక్టర్) అవార్డును అందుకున్నారు. అమెజాన్ ఒరిజినల్ సిరీస్ అయిన ‘సివరపల్లి’ వెబ్ సిరీస్‌లో ఆయన పోషించిన పాత్రకు ఈ గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో దేశవ్యాప్తంగా సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

​ఈ వేడుకలో రాగ్ మయూర్ బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పేయి, బోమన్ ఇరానీలతో పాటు ప్రముఖ దర్శక ద్వయం రాజ్ & డీకే వంటి వారితో కలిసి వేదికను పంచుకున్నారు. ప్రాంతీయ కథలు, ఇక్కడి పాత్రలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి భాషా బేధాలు అడ్డంకి కాదని ఈ విజయం నిరూపించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. తన అంకితభావంతో ఉత్తమ నటనను ప్రదర్శించిన రాగ్ మయూర్, రాబోయే తరం యువ నటులకు స్ఫూర్తిగా నిలుస్తారని పరిశ్రమ వర్గాలు అభినందిస్తున్నాయి.

తాజా వార్తలు