ఇవ్వడంలో ఆనందం ఉందట !

Published on Apr 18, 2019 3:00 am IST

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కాంచన 3’. కాగా ఏప్రిల్ 19వ తేదీన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకానుంది. అయితే తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్రబృందం జరుపుకుంది.

ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారి ఆశీర్వాదం వల్ల, సూపర్ స్టార్ రజినీకాంత్ గారి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. నాగార్జున గారు దర్శకుడిని చేయడం వల్లే ఈ రోజు మీ ముందున్నాను. సేవా కార్యక్రమాలు చేయడానికి మా అమ్మ మాటే కారణం. ఇవ్వడంలో ఆనందం ఉంది’ అని తెలిపారు.

ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదలచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :