మన సౌత్ సినిమా దగ్గర హారర్ కామెడీ సినిమాలకి ఒక ట్రెండ్ సెట్ చేసిన చిత్రాల్లో దర్శకుడు రాఘవ లారెన్స్ స్టార్ట్ చేసిన ముని సిరీస్ కూడా ఒకటి. ఇందులో భాగంగా వచ్చిన “కాంచన” ఫ్రాంచైజ్ కి మంచి రెస్పాన్స్ ఉంది. ఇలా ఎంతో కాలం నుంచి ప్లాన్ చేస్తున్న సినిమానే కాంచన 4. ఈసారి మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న ఈ హారర్ కామెడీ కొన్నాళ్ల కితం షూటింగ్ మొదలు పెట్టుకుంది.
ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే రాఘవ లారెన్స్ ఈ సినిమాని కూడా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా నటుడు శ్రీమాన్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేయడం వైరల్ గా మారింది. దీనితో చాలా రోజుల తర్వాత ఈ సినిమాపై అభిమానులకి ఓ క్లారిటీ వచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా నటిస్తుంది. అలాగే భారీ బడ్జెట్ తో ఈ హారర్ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
When both brothers join
Together
Its celebration in set pic.twitter.com/RXsM3kmdwD— actor sriman (@ActorSriman) February 22, 2026
