రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. రావాలా? వద్దా? వీడియోతో లారెన్స్ ప్రకటన!

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. రావాలా? వద్దా? వీడియోతో లారెన్స్ ప్రకటన!

Published on Jun 12, 2026 11:09 AM IST

సినీ రంగంలో అనేక విభాగాల్లో టాలెంట్ కలిగిన స్టార్స్ లో కోలీవుడ్ సహా టాలీవుడ్ లో కూడా బాగా పరిచయం ఉన్న పేరు రాఘవ లారెన్స్. ఒక డాన్స్ మాస్టర్ గానే కాకుండా దర్శకునిగా హీరోగా, సంగీత దర్శకునిగా ఇలా అనేక విభాగాల్లో తనకి టాలెంట్ ఉంది. అంతే కాకుండా అంతకుమించిన దాన గుణం లారెన్స్ కి ఉండటం అనేది తనని మరో మెట్టు ఎక్కించింది.

అయితే లారెన్స్ గత కొన్ని రోజులు కితం నేడు ఓ కీలక అనౌన్సమెంట్ ని ఇవ్వబోతున్నట్టు తెలిపాడు. ఇప్పుడు అందులో భాగంగా ఓ వీడియో ద్వారా తన ప్రకటన జారీ చేసాడు. 18 నిమిషాల ఈ వీడియోలో లారెన్స్ తనకి సేవ మాత్రమే ముఖ్యం అని రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది మీరు చెప్పే మాటని బట్టే నిర్ణయం తీసుకోబడుతుంది అని లారెన్స్ తెలిపారు.

రమ్మంటే వస్తాను వద్దు అంటే ఇలానే సేవ చేసుకుంటూ ముందుకు వెళతాను అని రాఘవ లారెన్స్ ఓ క్లారిటీ కూడా ఇచ్చాడు. తాను కలలో కూడా రాజకీయాల్లోకి వస్తాను అని భావించలేదు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం అలాగే జల్లికట్టు, ఇతర రాజకీయ అంశాలు తనని ప్రోత్సహించాయని తెలిపాడు. కానీ రావాలా వద్దా అనేది మీరు చెప్పే మాట మీదే ఆధారపడి ఉంటుంది అని తుది నిర్ణయం తన అభిమానులు, ఫాలోవర్స్ కి వదిలేసాడు.

అయితే లారెన్స్, తమిళనాట దళపతి సీఎం విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీలో చేరుతారని విజయ్ గెలిచి, రాజీనామా చేసిన తిరుచ్చి సీట్ లో పోటీ చేస్తాడని కొన్ని రూమర్స్ వచ్చాయి. సో ఇప్పుడు అందుకు లారెన్స్ సిద్ధంగానే ఉన్నాడని చెప్పొచ్చు. మరి ప్రేక్షకులు ఎలాంటి స్పందన అందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు