ఏకంగా ఇల్లు కట్టించి ఇచ్చిన ‘మల్టీ టాలెంటెడ్ హీరో’ !

Published on May 19, 2019 10:24 pm IST

మల్టీ టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ చేసే సేవా కార్యక్రమాలు గురించి ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. గుండె జ‌బ్బుతో బాధ‌ప‌డే ఎంతోమంది పిల్లలకు ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు కాపాడాడు. మరోఎంతోమంది అనాధ, పేద విద్యార్థులకు విలువులతో కూడిన విద్య అందేలా వారిని ఉన్నంతగా చదివిస్తున్నాడు. వీటికి తోడు ఎక్కడ ఏ తుఫాన్ వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నా తన వంతుగా లక్షల్లో విరాళాలు ఇచ్చి ఆదుకుంటున్నాడు. ఒక్కమాటలో చెప్పుకుంటే ఇప్పటి సినిమా హీరోల్లో ‘లారెన్స్’లా సేవ చేసే హీరోనే లేడంటే అది అతిశయోక్తి కాదు. అవునని ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు లారెన్స్.

ఓ పండు ముసలావిడ ఇళ్లు లేకుండా ఇబ్బంది ప‌డుతుంది. ఆ విషయం తెలిసి.. ఆమెకు ఏకంగా ఇళ్లు కట్టించి ఇచ్చాడు. ఈ రోజు ఆ ముస‌లావిడ త‌న కొత్త ఇంట్లోకి గృహ‌ప్ర‌వేశం కూడా చేశారు. స్వయంగా ఈ విష‌యాన్ని లారెన్స్ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. ఆ ముస‌ల‌వ్వ పడుతున్న బాధలు గురించి త‌న‌కు చెప్పిన వ్యక్తులకు ఈ సంద‌ర్భంగా కృతజ్ఞతలు కూడా తెలిపాడు. ఎంతైనా.. లారెన్స్ ఈజ్ గ్రేట్.

సంబంధిత సమాచారం :

More