ముగ్గురు దర్శకులు,ముగ్గురు హీరోయిన్స్ తో దర్శకేంద్రుని సెన్సేషనల్ మూవీ.

Published on May 28, 2019 11:00 am IST

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ జయంతి సంధర్బంగా ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ప్రకటించారు. అదేంటంటే తాను త్వరలో ముగ్గురు దర్శకులు,ముగ్గరు హీరోయిన్స్ తో ఓ మూవీ చేయనున్నారట,ఐతే హీరో ఎవరు అనేది సస్పెన్స్ . ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

“నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR” అని ట్వీట్ చేసిన రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్ తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

అడవిరాముడు,కొండవీటి సింహం, మేజర్ చంద్రకాంత్, జస్టిస్ చౌదరి, గజ దొంగ వంటి మూవీస్ వీరి కంబినేషన్లో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ రికార్డు లను తిరగరాశాయి. తెలుగు సినిమాకు కమర్షియల్ ఫార్మాట్ ను వీరే పరిచయం చేశారు అనడం అతిశయోక్తి కాదు.

సంబంధిత సమాచారం :

More