ఓటిటి సమీక్ష: ‘వాణి నా రాణి’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘వాణి నా రాణి’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Published on May 18, 2026 9:01 AM IST

ఓటీటీ స్ట్రీమింగ్ తేది : మే 17, 2026
ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: రవి కిరణ్, భావన లాస్య, రాజా రవీంద్ర
దర్శకత్వం: తేజ
నిర్మాత: రాఘవేంద్ర రావు బి ఏ
సంగీతం: సాయి మధుకర్
ఛాయాగ్రహణం: సునీల్ కుమార్ నామా
కూర్పు: వెంకట్ సి హెచ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం మన తెలుగు ఓటిటి యాప్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన లేటెస్ట్ లఘు చిత్రమే ‘వాణి నా రాణి’. వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన ఈ ఎపిసోడ్ లో యాంకర్ రవి నటించగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బి ఏ పర్యవేక్షణలో వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

బాగా పాపులర్ అయ్యినటువంటి నవలా రచయిత విహారి (యాంకర్ రవి కిరణ్) రాసిన వాణి నా రాణి అనే పుస్తకం పెద్ద హిట్ అవుతుంది. కానీ అదే సమయంలో తన అభిమానులని వ్యతిరేకతను కూడా అందుకుంటుంది. ఎందుకంటే అందులో క్లైమాక్స్ కి అర్ధాంతరంగా వదిలేయడం వాళ్ళకి నచ్చలేదు. అసలు ఆ పుస్తకంలో కథ ఏంటి? ఎందుకు తాను ముగింపు ఇవ్వకుండా వదిలేసాడు? దానికి ముగింపు ఎవరు ఇస్తారు? ఈ క్రమంలో గౌరీ (భావన లాస్య) కి విహారికి సంబంధం ఏంటి? అనేవి తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

కథా సుధ నుంచి కొంచెం గ్యాప్ తర్వాత రాఘవేంద్ర రావు గారి నుంచి వచ్చిన ఈ లఘు చిత్రం మరోసారి ఆయన మార్క్ మ్యాజిక్ ని చేసింది అని చెప్పొచ్చు. దాదాపు సగానికి కొంచెం ఎక్కువ నిడివి వరకు తన ఫ్లేవర్ లో మంచి ఎమోషన్స్ ఇంకా కథనంతో సాగడం ఇందులో బాగుంది.

ఇక యాంకర్ రవి తన పాత్రలో చాలా బాగా చేసాడు. సరదా సరదాగా కనిపించే తాను ఈ చిత్రంలో విహారి పాత్రలో చాలా హుందాగా మంచి బాడీ లాంగ్వేజ్ ని మైంటైన్ చేస్తూ ఆ రోల్ కి పూర్తి న్యాయం చేకూర్చాడు. అలానే గౌరీ పాత్రలో భావన లాస్య యంగ్ పోర్షన్స్ లో బాగా నటించింది.

అలానే ఇద్దరి నడుమ లవ్ స్టోరీ, వారి నడుమ సంభాషణలు నీట్ గా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలానే మధ్యలో సరస్వతీ దేవిపై చెప్పిన ఓ కథ పోర్షన్ బాగుంది. ఇక వీరితో పాటు రాజా రవీంద్ర తన రోల్ లో బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

సగానికి పైగా ఎక్కువ నిడివి వరకు కథనం చాలా సాఫీగా నీట్ గా సాగింది కానీ తర్వాత కథనం మాత్రం కొంచెం ఇబ్బందికరంగా.. ఊహాజనితంగా అనిపిస్తుంది. మెయిన్ గా కాస్టింగ్ లో భావన లాస్య తన యంగ్ పోర్షన్స్ లో సూట్ అయ్యింది కానీ ఓల్డేజ్ కి వచ్చేసరికి ఆ పోర్షన్స్ లో ఆమె సూట్ కాకపోవడం వల్ల కథనంలో సోల్ కి మిస్ మ్యాచ్ అవుతుంది.

పైగా రాజా రవీంద్ర భార్యగా ఆమెని చూపించడం ఇంకా పొంతన లేకుండా అనిపిస్తుంది. అలాగే కథనం కూడా ఒకింత నెమ్మదిగానే సాగింది. సో ఇవి కొంచెం ఇందులో డిజప్పాయింట్ చేస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి క్లీన్ సెటప్ తో డిజైన్ చేసి నాచురాలిటీ మిస్ కాకుండా ప్లాన్ చేశారు. అలాగే సంగీతం, కెమెరా వర్క్ బాగున్నాయి. ఎడిటింగ్ కొంచెం ఫాస్ట్ గా కట్ చేయాల్సింది.

ఇక దర్శకుడు తేజ విషయానికి వస్తే.. రాఘవేంద్ర రావు గారి విజన్ ని తాను బాగానే ఆవిష్కరించారు కానీ మలిసగంలో కొంచెం తడబడ్డారు. ముఖ్యంగా నటీనటుల ఎంపిక వారి మేకోవర్ లు పరంగా మరింత కేర్ తీసుకోవాల్సింది. ఇవి మినహాయిస్తే తన వర్క్ బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘వాణి నా రాణి’ లఘు చిత్రం రాఘవేంద్ర రావు గారి స్టైల్ సినిమాలు ఇష్టపడేవారికి ఓకే అనిపిస్తుంది, రవి మెచ్యూర్ పెర్ఫామెన్స్ కనబరిచాడు, కానీ కొంచెం స్లో కథనం, ఇతర కాస్టింగ్ పరమైన లోపాలు వంటివి డిజప్పాయింట్ చేస్తాయి. ఇవి పక్కన పెడితే ఈ లఘు చిత్రాన్ని చూడొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

తాజా వార్తలు