ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?

ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?

Published on Aug 7, 2026 12:03 AM IST

అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ఎపిక్ స్టూడియోస్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘పళ్ళబురుసు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఒకింత మంచి బజ్ క్రియేట్ చేసింది. బలగం మూవీ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఆగస్టు 7న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో టీజర్‌తో ఆకట్టుకున్న ‘పళ్ళబురుసు’ ట్రైలర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు